Header Banner

రైల్వే ప్రయాణికులకు షాక్! మే 1 నుండి కొత్త రూల్! వారికి ఆ బోగీల్లో నో ఎంట్రీ!

  Tue Apr 29, 2025 14:36        India

ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఇండియన్ రైల్వే అప్పుడప్పుడు ప్రయాణికులు షాక్ అయ్యే నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. తాజాగా ఇష్టానుసారంగా ప్రయాణం చేసే వారికోసం రైల్వే కొత్త రూల్ ని అమల్లోకి తీసుకువస్తోంది. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేసుకున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం కొంతమంది ప్రయాణికులకు షాక్ అని చెప్పాలి.


టికెట్ కన్ఫర్మ్ కాని వారికి రైల్వే కీలక సూచన

సహజంగా ట్రైన్లో ప్రయాణం చేయాలనుకునేవారు అడ్వాన్స్డ్ రిజర్వేషన్, కరెంట్ రిజర్వేషన్, జనరల్ టికెట్, తత్కాల్ టికెట్ ఇలా తమ టికెట్లను బుక్ చేసుకుంటారు. ఏసి, స్లీపర్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకున్న వారు కన్ఫామ్ కాకపోయినప్పటికీ ఏసీ , స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేసే అవకాశం ఉండేది. అయితే ఇకపై టికెట్ కన్ఫర్మ్ కాని వారు అలా ప్రయాణం చేయడానికి వీలులేదని రైల్వే తేల్చి చెప్పింది.

ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

స్లీపర్, ఏసీ బోగీలలోకి ఎక్కటానికి వీలు లేదు

టికెట్ కన్ఫర్మ్ కాని వాళ్ళు రిజర్వేషన్ క్యాబిన్లో ఎక్కడం కారణంగా అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేసుకున్నవారు టికెట్టు కన్ఫర్మేషన్ అయిన ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఈ కారణంగానే టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేవిధంగా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్న రైల్వే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు స్లీపర్, ఏసీ బోగీలలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.

 

మే 1 నుండి కొత్త రూల్

ఈ కొత్త రూల్ మే ఒకటవ తేదీ నుంచి అమలులోకి తీసుకు వస్తున్నట్టు పేర్కొంది. ఇక టికెట్ బుక్ చేసుకుని టికెట్ కన్ఫామ్ కాక వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు ఏసి, స్లీపర్ క్లాస్ లలో కాకుండా జనరల్ బోగీలో మాత్రం ప్రయాణం చేయవచ్చునని ఇండియన్ రైల్వే వెల్లడించింది. ఇక ఈ కారణంతో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు పొరపాటున కూడా స్లీపర్ మరియు ఏసీ బోగీలో ఎక్కకూడదు.

ఏసీ, స్లీపర్ కోచ్ లలో వారు ఎక్కితే జరిమానా ఒకవేళ అలా ఎక్కితే జనరల్ కంపార్ట్మెంట్ కు తరలించేందుకు, జరిమానా విధించేందుకు టిటిఈ కి అధికారం ఉంది. ఇక అంతే కాదు ఏదైనా రైలులో టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండి కన్ఫర్మ్ కాని వారికి, ఆ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరేటప్పుడు టికెట్ వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటే ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది. కాబట్టి ఇకపై వెయిటింగ్ లిస్టులో ఉన్నా సరే రైల్లో ఏసీ కోచ్ లలో, రిజర్వేషన్ బోగిలలో ఎక్కుతాం అంటే ఇబ్బంది తప్పదు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IndianRailways #RailwayRules #TrainTravelUpdate #RailwayPassengers #NewRailwayRules #NoEntry #RailwayAlert #May1Rules